*సింహద్రినాధుడికి శ్రీ చందనం*

          *సింహద్రినాధుడికి శ్రీ చందనం*





*16న తొలి విడత చందనం ఆరగదీత..ఏర్పాట్లు చేస్తున్న ఆలయ వర్గాలు*

(సింహాచలం) అక్షరవిజన్ న్యూస్ -: దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహ స్వామి వారి చందనోత్సవం(అప్పన్న నిజరూప దర్శనం) ఈ నెల 23న అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియ నాడు సాంప్రదాయ  బద్దంగ నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ వర్గాలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఏడాది పొడవునా సుగంధభరిత చందనంతో కొలువుండే స్వామి  ఒక్క వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే భక్తలకు తన నిజరూప దర్శనం గావిస్తారు. దీనినే భక్తులంతా చందనయాత్ర, చందనోత్సవంగా పిలవడం జరుగుతుంది. ఆలయ ఇవో వి.త్రినాథరావు ఆధ్వర్యంలో భక్తులకు సకల సదుపాయాలు కల్పించే దిశగా ముందుకు సాగుతున్నారు. మరో వైపు ఈ నెల 16న తొలి విడత చందనం ఆరగదీత కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆలయ అర్చక పరివారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది అని అన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆలయ స్ధానాచార్యులు టీపీ రాజగోపాల్‌, ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాస్‌ ఆచార్యులు, పురోహితులు కరి సీతారామాచార్యులను అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు అడిగి తెలుసుకున్నారు. చందనోత్సవం రోజు నిజరూప దర్శనం అనంతరం తొలి విడతగా స్వామికి మూడు మనుగుల చందనాన్ని సమర్పించనున్నారు. ఆ తరువాత వచ్చే వైశాఖ, జ్యేష్ట, ఆశాఢ పౌర్ణమిల్లో మూడేసి మణుగుల చొప్పున ఏడాదిలో మొత్తం 12 మణుగుల(500కేజీలు) చందనం సమర్పించడం పురూరవ చక్రవర్తి కాలం నుంచి సంప్రదాయబద్దంగా వస్తుంది. ఈ ఏడాది చందనోత్సవానికి విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం స్ఫష్టమైన సూచనలు చేసింది అని తెలిపారు.

బ్యూరో చీఫ్ -: డీ ఎస్ ఎన్ మూర్తి.


Comments