ఏపీ ఫోటో & వీడియో గ్రాఫర్స్ క్రికెట్ మ్యాచ్

 ఏపీ  ఫోటో & వీడియో గ్రాఫర్స్  క్రికెట్ మ్యాచ్

విశాఖపట్నం అక్షరవిజన్ న్యూస్ -: ఏపి ఫోటో& వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైస్సార్ క్రికెట్ స్టేడియం లో అంగరంగ వైభవంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా డాగురే ఫోటో కి పూలమాల వేసి అంజలి ఘటించారు .ఏపీ స్టేట్ అసోసియేషన్ కి సేవలు అందించి స్వర్గస్తులు అయిన వారి జ్ఞాపకార్థం ఈ యొక్క ట్రోఫీకి ఈశ్వర్ అని నామకరణం చేశారు. ఇందులో ఆరు టీములు పాల్గొనడం జరిగింది అని అసోసియేషన్ చైర్మన్ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ సెక్రటరీ పవన్ వాసు , అధ్యక్షుడు సి హెచ్ మధు, జనరల్ సెక్రటరీ మళ్ల మోహన్ వెంకటేష్ , ఈశ్వర్, నాగరాజు, తదితర సభ్యులు పాల్గొన్నారు.

రిపోర్టర్-: రాజు



Comments