కఠిన కారాగార శిక్ష..

అక్షరవిజన్ న్యూస్.. మెదక్ జిల్లా.. మైనర్‌ బాలికను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మెదక్ జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. మైనర్ బాలికను లైంగికంగా వేధించారని కేసు నమోదు కావడంతో.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఘటనకు సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు.విచారణ జరిపిన కోర్టు పాపన్నపేటకు చెందిన నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్షతో పాటు.. రూ.31వేలు జరిమానా విధించింది. ఈ ఘటనపై బాధిత కుటుంబీకులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments